పేదవాడి ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్... సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన బూర్గంపాడు జడ్పిటిసి

Published: Friday January 06, 2023
 పినపాక నియోజకవర్గ  ఎమ్మెల్యే& ప్రభుత్వ విప్ రేగా కాంతారావు   ఆదేశాల మేరకు బూర్గంపాడు మండలంలో  పలు బాధితుల కుటుంబాల  ఇంటికి వెళ్లి సీఎంఆర్ఎఫ్  చెక్కులను  పంపిణీ చేసిన బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత. ఈ కార్యక్రమం లో బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కామిరెడ్డ్ శ్రీ లత  మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ప్రాణప్రాయ స్థితి లో ఉన్న వారికి ముఖ్య మంత్రి సహాయ నిధి కింద చికిత్స కు తగిన సహాయం బాధితులకు ఆందిస్తుందని  ఆమె అన్నారు., నిరుపేదల సంక్షేమం కోసం  తెలంగాణ ప్రభుత్వం పూర్తి భరోసా కాల్పిస్తుందని , అర్హులైన ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న  సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలు మొత్తం  నకిరిపేట కు చెందిన ఎన్  లింగస్వామి  కి  రూ 21,500, టెకులచెరువు కి   చెందిన  ఈ సూర్యం కి  రూ 60,000  వేలు,మెరంపల్లిబంజర కి చెందిన పి,  చిన్న క్రిష్ణ రెడ్డి కి రూ 28,000 వేలు  చెక్కు, నాగినేనిప్రోలు కి చెందిన డి, నరసింహారావు కి రూ  1,00,000  సారపాక కు చెందిన సయ్యద్ సజీదా బేగం కి 46,000 వేలు చెక్కులను  అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి  , మోరంపల్లి ఉపసర్పంచ్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి , రెడ్డిపాలెం సర్పంచ్ భూక్యా శ్రావణి  , ఉప సర్పంచ్  యడమకంటి ఝాన్సీ   ,గ్రామాకమిటి అధ్యక్షులు ,  వీరన్న ( నాకిరిపేట ),  కైపు కాగిందర్ రెడ్డి (  బంజార ), కాటం వెంకటరామిరెడ్డి  ( రెడ్డిపాలెం ),సొసైటీ డైరెక్టర్ కుందూరు పెద్ది రెడ్డి, సోసైటీ వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి, స్థానిక వార్డ్ నంబర్స్ , మండల నాయకులు, బీసీ సేల్ అధ్యక్షులు, స్థానిక గ్రామపెద్దలు పార్టీ నాయకులు తదితర   ఈ కార్యకర్తలు పాల్గొన్నారు.