హఫీజ్పెట్ డివిజన్ లో పర్యటించిన విప్ గాంధీ

Published: Thursday January 20, 2022
శేరిలింగంపల్లి - ప్రజాపాలన (జనవరి 19) : జనప్రియ నగర్ ఫేస్ 1 కాలనీలో పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు బుధవారం రోజు కాలనీ లో పర్యటించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. కైదమ్మ కుంట చెరువు కట్ట కింద గల కల్వర్ట్ పనులు పూర్తి చేయాలని జనప్రియ ఫేస్ 1 కాలనీలో రోడ్డు ను పునరుద్ధరణ చేసిన శుభసందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ కి కాలనీ వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ. కల్వర్ట్ సమస్యను త్వరలోనే పరిష్కరించి అతి త్వరలోనే కల్వర్ట్ ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, శాశ్వత పరిష్కారం చూపుతాం అని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని, తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. చెరువు అలుగు నుండి నిర్మించిన వరద నీటి కాల్వ నిర్మాణం పూర్తి చేస్తామని, కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకోని, వారి విజ్ఞప్తి మేరకు కాలనీలో పాదయాత్ర చేపట్టడం జరిగినది అని, కాలనీలలో క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు, అక్కడికి అక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించడం జరిగినది. అదేవిధంగా కాలనీలో నెలకొన్న వరద నీటి కాల్వ సమస్యను పరిష్కరిస్తానని మరియు. సమస్యలపై ప్రభుత్వ విప్ గాంధీ సానుకూలంగా స్పందించి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు, విద్యుత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ వాసులు అందరూ కలిసి కాలనీ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని, కాలనీ వాసులందరి సమిష్టి కృషి తో ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దుతామని గాంధీ పేర్కొన్నారు. ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. మెరుగైన జీవన ప్రమాణాలకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు అదేవిధంగా డివిజన్ లో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తామని ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ ఎంసీ ఎఈ ప్రతాప్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్ రజియా బేగం, జనప్రియ ఫేస్ 1 కాలనీ వాసులు శాంత య్య, మలికార్జున్, ఉమేష్, ఉమామహేశ్వరరావు, రవి, రాంచందర్, సురేష్, ఫణి కుమార్, ప్రకాష్ పటేల్, శ్రీనివాస్, వాసుదేవ్, రాం బాబు, ప్రభ, లీల రాణి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు