కారు గ్రామంలో ఇసుక డంపులు సీజ్ చేసిన గిర్ధవారులు గోవర్ధన్, కిరణ్ కుమార్ లు

Published: Wednesday September 14, 2022
ప్రజా పాలన ప్రతినిధి. సెప్టెంబర్ 13 నవాబుపేట మండలం పరిధిలోని కారుర్ వాగులో దాదాపుగా ఫిల్టర్ ఇసుక మాఫియా లోకిరేవు, చౌటపల్లి, మల్లారెడ్డి పల్లి ఇప్పటూర్ ,కారూర్ గ్రామాలకు చెందిన పది మందికి పైగా కృత్రిమంగా తయారు చేస్తున్నారు .మట్టిని జెసిబి ల సహాయంతో టాక్టర్లను లోడ్ చేసి ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారు ఇసుక మాఫియా రోజుకు వేల టన్నుల కొద్దీ రవాణా చేస్తున్న, సంబంధించిన అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు వాగు సమీపంలో చుట్టుపక్కల మట్టిని తరలించడం తో పెద్ద పెద్ద గుంతలు గా ఏర్పడ్డాయి. కొన్ని వేల క్యూబిక్ మీటర్ల మట్టిని ఇసుక అక్రమార్కులు తరలించిన సంబంధించిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులకు కనబడటం లేదా అని చుట్టుపక్కల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.. ఇసుక అక్రమార్కులపై సరైన చర్యలు
 తీసుకోకా పోవడంతో అదేపని తిరిగి కొనసాగిస్తున్నారు, ఇసుక అక్రమర్కులకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. ఇకనైనా కృత్రిమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని చుట్టూ పక్కల ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.ఆ గ్రామాలకు సంబంధించిన వారే అక్రమ ఇసుక రవాణా నడిపిస్తునారు.ఎన్ని సార్లు కేసులు నమోదు అయిన తిరిగి అదే పని చేస్తున్నారు.వారి వెనుక ఎవరున్నారు అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అలాంటి వారికి చేయూత నిస్తే పర్యావరణ పరిరక్షణ కు హాని కలిగిస్తుంది అని నిపుణులు సూచిస్తున్నారు ఇకనైనా ఆగుతుందా వేచి చూడాలి.