ఆదర్శ జానపద సాంస్కృతిక కళా సంస్థ 20వ వార్షికోత్సవ ఉత్సవాలు

Published: Monday June 13, 2022
జన్నారం రూరల్, జున్ 12, ప్రజాపాలన: ఈ నెల ఇరువై అరు తేది న రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలో నిర్వహించనున్నట్లు  ఆదర్శ జానపద సాంస్కృతిక కళా సంస్థ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి రాజలింగం తెలిపారు.,  అదివారం స్థానిక విలేకరులతో  మాట్లాడుతూ ఈ కళాప్రదర్శనానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళారూపాలలో నిష్ణాతులైన కళాకారులను నాటి రాజకీయ సినీ రంగ ప్రముఖులచే బహుమతులను  సత్కరించడం జరుగుతుందని తెలిపారు., అదర్శ జానపద సాంస్కృతిక నిర్వహణ కళావైబవాన్ని చూడడానికి అనేకమంది రాష్ట్ర ప్రముఖులు పాల్గొననున్నారని అన్నారు. ఇందులో ,  గుస్సాడీ, దిమ్మిశా, కోలాటం, జానపద గీతాలు, యక్షగానం, తదితర కళాబృందాలు, ప్రదర్శనలు  ఉంటాయని తెలిపారు..    ఈ కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ జిల్లా సమైక్య వై. ఉమామహే శ్వరరావు, వెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రామ్ ప్రకాష్, కళా బంధువులు మిక్కిలినేని రాజశేఖర్ కళాకారులు తదితరులు పాల్గొన్నారు..