వార్డును పారిశుద్ధ్య రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

Published: Wednesday January 12, 2022
32 వ వార్డు కౌన్సిలర్ మల్లేపల్లి నవీన్ కుమార్
వికారాబాద్ బ్యూరో 11 జనవరి ప్రజా పాలన : 32వ వార్డును పారిశుద్ధ్య రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని కౌన్సిలర్ మల్లేపల్లి నవీన్ కుమార్ అన్నారు. మంగళవారం స్వచ్ఛ సర్వేక్షన్ 2022 లో భాగంగా మున్సిపల్ పరిధిలోని 32వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ గుళ్ళపల్లి మంజుల రమేష్ ఆదేశాల మేరకు తడి పొడి చెత్త వేరువేరుగా వేయాలనే వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలతో మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త ఏ విధంగా వేరు చేయాలో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. తడి చెత్త పొడి చెత్త, హానికారక చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ కవర్లను నిషేధించడం, పరిసర ప్రాంతాల్లో చెత్తను వేయకుండా చూడడం, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం, మురికి కాలువలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవడం వంటి విషయాలను ప్రజలకుు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ జవాన్ శంకర్, ఆర్ పి రాజ్యలక్ష్మి, మున్సిపల్ సిబ్బంది, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.