వజ్రోత్సవాలలో యావత్‌ ప్రజానీకం భాగస్తులు కావాలి : కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

Published: Friday September 16, 2022

ప్రజా పాలన -శేరిలింగంపల్లి /సెప్టెంబర్ 15 : జరిగే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకల్లో చందానగర్ డివిజన్ ప్రజలు, ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులకు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయభిలాషులు, యావత్‌ ప్రజానీకం భాగస్తులు కావాలని, ఈ వేడుకలను విజయవంతం చేయాలని 110 చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16వ తేదీన ఉదయం 9 గంటలకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి పీజేర్ స్టేడియం వరకు విద్యార్థులు, యువతీ, యువకులు, మహిళలతో భారీ ర్యాలీగా బయలుదేరనున్నారని తెలిపారు. వేలాది మందితో నిర్వహించే మీటింగ్ కావడంతో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో కలిసి 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్బంగా ఈ ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాధాన్యతను చాటేలా పెద్దఎత్తున ఉత్సవాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున ప్రతి అంశానికి ప్రాముఖ్యతను ఇస్తూ ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే పీజేఆర్ స్టేడియంలో భోజన వసతి కలదని తెలియజేసారు.