జోగన్ పల్లి లో పౌర హక్కుల దినోత్సవం

Published: Thursday September 01, 2022

కోరుట్ల, ఆగస్టు 30 ( ప్రజాపాలన ప్రతినిధి ):
కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో మంగళ వారం రోజున  పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కోరుట్ల మండలానికి సంబంధించిన రెవెన్యు అధికారులు గ్రామానికి విచ్చేసి పౌర హక్కుల గురించి వివరించారు.
సమాజంలో అందరూ సమానమని, అంటరాని తనం , తక్కువ కులం అని చూడడం నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ యువజన సంఘల నాయకులు మాట్లాడుతూ  సమాజంలో అందరూ సమానమని భావన అందరిలో కలగాలని,అక్కడక్కడ అసమానత భావాలు ఇంకా వుండడం దురదృష్టకరం అని అన్నారు. ప్రతి ఒక్కరూ వారి హక్కులను తెలుసుకొని వాటికి అనుగుణంగా నడుచుకోవాలని తెలిపారు. సమాజంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కుల వల్లనే స్వేచ్ఛగా జివిస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్.ఐ మహమ్మద్, గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.