బిఎస్పి సల్బత్తాపూర్ గ్రామ కమిటీ ఎన్నిక

Published: Friday December 24, 2021
వికారాబాద్ నియోజకవర్గ ఇంచార్జి పెద్ది అంజన్న
వికారాబాద్ బ్యూరో 23 డిసెంబర్ ప్రజాపాలన : బహుజన్ సమాజ్ పార్టీ సల్బత్తాపూర్ గ్రామ కమిటీని నియమించామని  వికారాబాద్ నియోజకవర్గ ఇంచార్జి పెద్ది అంజన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంట్వారం మండలం ప్రధాన కార్యదర్శి విజయ్ ఆధ్వర్యంలో సల్బత్తాపూర్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కావలి నర్సిములు, ఉపాధ్యక్షునిగా బండల సురేష్, ప్రధాన కార్యదర్శులుగా ఎక్కెల్లి గోవర్ధన్, బాలయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బి ఎస్ పి పార్టీ లోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రమోద్ కుమార్, అరవింద్, అనంతయ్య, జయానందం, శాంత్కుమార్, గోవర్ధన్, మల్కయ్య, నర్సిములు, రాజు, గోపాల్, ప్రవీణ్, చెంద్ర శేఖర్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.