ప్రజా సమస్యలపై సిపిఎం నిరంతరం పోరాటాలు

Published: Monday October 04, 2021
మధుర, అక్టోబర్ 03, ప్రజాపాలన ప్రతినిధి : మధిర విలేకరులు సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సిపిఎం దశలవారీ పోరాటం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్సైట్ తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్ రైతులను బ్రమల్లో ఉంచిందని ఆయన తెలిపారు. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 5వ తేదీన సిపిఎం ఆధ్వర్యంలో అశ్వరావుపేట నుండి ఆదిలాబాద్ వరకు 400 కిలోమీటర్ల రోడ్ల దిగ్బంధం కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి బీజేపీ టిఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు బండి రమేష్ మండల కార్యదర్శి మందా సైదులు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మధు పాల్గొన్నారు.