ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తోట రామాంజనేయులు ఎన్నిక

Published: Thursday October 06, 2022
 బోనకల్ ,అక్టోబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి: భారతదేశంలోనే ప్రధమ కార్మిక సంఘమైన, కార్మిక ఉద్యమంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా బోనకల్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన తోట రామాంజనేయులు ఎన్నికయ్యారు. నూతనంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తోట రామాంజనేయులు గతంలో అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) లో కీలకంగా పని చేశారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నా సమయంలో రామాంజనేయులు అలుపెరుగని పోరాటాలు నిర్వహించారు . 2009 లో అప్పటి ప్రభుత్వ విద్యను ప్రయివేటు పరం చేసేందుకు గాను విడుదల చేసిన జీవో నెంబర్ 75 కు వ్యతిరేకంగా మధిరలో పోరాటం చేసి 3 రోజుల పాటు జైలు కు వెళ్ళారు .తెలంగాణా ఉద్యమంలో 100 పైగా సార్లు అరెస్ట్ అయ్యి వివిధ సందర్భాలలో అనేక రోజులు జైలు సైతం వెళ్ళటం జరిగింది . ముఖ్యంగా 2012 లో జరిగిన హాస్టల్ విద్యార్థుల సమస్యలపై నిర్వహించిన ఆకలి కేక కార్యక్రమంలో అరెస్ట్ అయ్యి 12 రోజుల పాటు ఖమ్మంకు జైలుకూ వెళ్లారు .బోనకల్ మండల కార్యదర్శి గా ఉన్నా సమయంలో సీపీఐ ని బలోపేతం చెయ్యడానికి ఆయన అనేక రకాలుగా కృషి చేసారు. కార్మిక ఉద్యమంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన, మొదటి కార్మిక సంఘము అయిన ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తోట రామాంజనేయులకు సిపిఐ బోనకల్ మండల కార్యదర్శి వెంగల ఆనందరావు,జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్, ఏఐకేఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి జక్కుల రామారావు, మండల సహాయ కార్యదర్శి ఆకెన పవన్, సిపిఐ సీనియర్ నాయకులు జక్కా నాగభూషణంతోపాటు మండలంలోని వివిధ రాజకీయ పక్షాల నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.