ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 5ప్రజాపాలన ప్రతినిధి *ప్రజలకోసం పనిచేస్తే పదవులు వెతుక్కుంటూ వస

Published: Tuesday December 06, 2022

ప్రజలకోసం నిజాయితీగా పనిచేస్తే పదవులు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడుగా నూతనంగా నియమితులైన సత్తు వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను సోమవారం మర్యాద పూర్వకంగా కలిసారు. జిల్లా చైర్మెన్ గా తనను నియమింపజేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీలో సమర్థత కలిగిన నాయకులకు కొదువలేదని, సమయాను కూలంగా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఎన్నికలలో పోటీ చేసే అవకాశం రానివారికి నామినేటెడ్ పదవులలో అవకాశాలిస్తున్నామని, పార్టీ పదవుల్లో కూడా మరింతమందికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. పదవులు శాశ్వతం కాదని ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సాదించే దిశగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్యే నిర్దేశించారు. మార్కెట్ కమిటీ సహా మరిన్ని పదవులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కృపేష్, టిపిటిసి జంగమ్మ, మండల పార్టీ అద్యక్షుడు బుగ్గరాములు, మున్సిపల్ అద్యక్షులు అల్వాల వెంకట్ రెడ్డి, సిద్దంకి కృష్ణారెడ్డి, కొప్పుల జంగయ్య, పార్చబాష, కార్యదర్శి మడుపు వేణుగోపాల్, మహేందర్, మంగసురేష్,  రాజేష్ గౌడ్, పల్లె జంగారెడ్డి, ఎంపిటిసిలు భరత్, జ్యోతి, శివలీల,
సర్పంచులు బండమీది కృష్ణ, బల్వంత్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.