ఉత్తమ ఎన్.సి.సి. అధికారి అవార్డు అందుకున్న దూడల వెంకటేశ్

Published: Monday November 29, 2021
యాదాద్రి-భువనగిరి జిల్లా 28 నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి: వరుసగా నాలుగో సారి ఉత్తమ ఎన్.సి.సి. అధికారిగా దూడల వెంకటేశ్ ఎన్నిక. 73వ ఎన్.సి.సి. దినోత్సవాన్ని పురస్కరించుకొని పదవ తెలంగాణ ఎన్.సి.సి.  బెటాలియన్ వరంగల్ లో ఘనంగా నిర్వహించారు.73వ దినోత్సవం సందర్భంగా జరిగిన ఎన్.సి.సి. కార్యక్రమంలో ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్.సి.సి. అధికారి దూడల వెంకటేష్ ఉత్తమ ఎన్.సి.సి. అధికారిగా ఎన్నిక అయినట్లు అధికారులు తెలిపారు. వరంగల్ బెటాలియన్ కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ శశాంక్ సరోడే చేతుల మీదుగా దూడల వెంకటేశ్ అవార్డు అందుకున్నారు. ఇలా ఉత్తమ ఎన్.సి.సి. అధికారి అవార్డును వరుసగా నాలుగో సారి దూడల వెంకటేశ్ అందుకోవడం విశేషం. అదేవిధంగా ఉత్తమ కాడేట్ గా ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని పశ్చిమట్ల అఖిల కూడా అవార్డును కమాండింగ్ అధికారి చేతుల మీదుగా అందుకున్నారు. బెస్ట్ కాడేట్ అవార్డు ఆలేరు కు రావడం వరుసగా ఐదో సారి. ఉత్తమ ఎన్.సి.సి. అధికారి అవార్డును వరుసగా నాలుగో సారి ఆలేరు ప్రాంత నివాసితులు దూడల వెంకటేశ్ అందుకోవడం తాల్క ట్రస్టు (భరత్ కుమార్ మెమోరియల్ సొసైటీ) సభ్యులు చరవాణి ద్వారా అభినందనలు తెలియజేశారు. తదుపరి ఈ అవార్డు పొందిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.నారాయణ మరియు ఉపాధ్యాయ బృందం శేఖర్, మంద సోమరాజు, హరినాథ్ రెడ్డి, యోగేశ్వరరావు, సాంబశివ, కాజా అలీ, నవీన్ కుమార్, మురళి, రవి, సత్యనారాయణ, వేణు, శ్యామ సుందరి, విజయలక్ష్మి, కవిత, స్వర్ణలత, లక్ష్మమ్మ, మీరా తదితరులు అవార్డు గ్రహీత లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ అధికారులు సుబేదార్ మణికందన్ హవల్దార్ శ్రీనివాసులు భరత్ కుమార్, సందీప్ జాదవ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.