గ్రామ ప్రజల శ్రేయస్సుకు కృషి చేయడం అభినందనీయం

Published: Friday November 18, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 17 నవంబర్ ప్రజాపాలన : గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు కోస్నం వేణుగోపాల్ రెడ్డి కుటుంబం కృషి చేయడం అభినందనీయమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కొనియాడారు. గురువారం ధారూర్ మండల పరిధిలోని తరిగోపుల గ్రామంలో గ్రామ సర్పంచ్ కోస్నం విశాల వెంకట్ రాంరెడ్డి, ధారూర్ జడ్పీటీసీ కోస్నం సుజాత, ధారూర్ మండల టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కోస్నం వేణుగోపాల్ రెడ్డి తండ్రి కీర్తి శేషులు కోస్నం లక్ష్మారెడ్డి  ఆధ్వర్యంలో 10వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని 18 సంవత్సరాలు నిండిన 250 మంది యువకులకు ఉచితంగా *పది లక్షల ప్రమాద భీమా* చేయిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటగా కీర్తిశేషులు కోస్నం లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకోసం ప్రజాప్రతినిధులుగా జడ్పీటీసీ, సర్పంచ్ లు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం సంతోషకరమని, మిగతావారు కూడ ఆదర్శంగా తీసుకొని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని సూచించారు. అనంతరం ప్రమాద బీమాకు దరఖాస్తు చేసుకున్నవారికి కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ధారూర్ మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు కావలి అంజయ్య ముదిరాజ్, రాజుగుప్తా, రైతు సంఘం అధ్యక్షుడు సీతగారి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు రాములు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు యువకులు, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.