గాయత్రి షాపింగ్ మాల్ సకుంబ వస్త్రనిలయం

Published: Monday October 04, 2021
మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 03 అక్టోబర్ ప్రజాపాలన : స్వయం ఉపాధి పొందుతూ ఇతరులకు ఉద్యోగ అవకాశాలను సృష్టించడం అభినందనీయమని మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని పాతగంజ్ లో గాయత్రి షాపింగ్ మాల్ ను 28వ వార్డు కౌన్సిలర్ మోముల స్వాతి రాజ్ కుమార్, దుకాణం వ్యవస్థాపకుడు ధన్ రాజ్ చౌదరి ఆధ్వర్యంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎదురు చూడకుండా స్వంతంగా వ్యాపారం చేపట్టడం ప్రశంసనీయమని కొనియాడారు. నాణ్యమైన వర్ణశోభిత వస్త్రాలు మార్కెట్ ధరల కంటే సరసమైన ధరలకు అన్ని రకాల దుస్తులు లభిస్తాయని పేర్కొన్నారు. గాయత్రి షాపింగ్ మాల్ వ్యవస్థాపకుడు ధన్ రాజ్ చౌదరి మాట్లాడుతూ.. నవ యువతుల స్టైలీస్ సంచలనం, మహిళల మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళే షాప్ అని అన్నారు. మా షాపులో ఎక్స్ క్లూజివ్ బ్రైడల్ వేర్, పట్టు శారీస్, డిజైనర్ శారీస్, గాగ్రాస్, చుడిదార్స్, డ్రస్ మెటీరియల్స్, పార్టీవేర్ లెహింగాస్, మెన్స్ వేర్, ఫార్మల్ సూట్స్, షేర్వాణి, ఫార్మల్ అండ్ క్యాజువల్స్, ఎత్నిక్ వేర్, బ్రాండెడ్ షర్టింగ్ అండ్ సూటింగ్, ఇన్న గార్మెంట్స్, ధోతి సెట్, జెంట్స్ ఆక్సెసరీస్, కిడ్స్ వేర్, ఫ్యాన్సీ ఫ్రాక్స్, గర్ల్స్ సల్వార్, స్కర్ట్స్ అండ్ లెగ్గింగ్స్, వెస్ట్రర్న్ డ్రెసెస్, బాయ్స్ ఎత్నిక్ వేర్, డెనిమ్ ఫ్యాంట్స్, న్యూ బోర్న్ బేబి క్లాత్స్ లభించును అన్నారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ నిర్వాహకులు దేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.