చిన్నారి శాన్విశ్రీ కి సినీ గేయ రచయిత ఆర్థిక సాయం..

Published: Monday July 12, 2021

బెల్లంపల్లి, జూలై 11, ప్రజాపాలన ప్రతినిధి : తాండూర్ గ్రామానికి చెందిన గోగర్ల మల్లేష్ ప్రమీల దంపతుల కూతురు శాన్విశ్రీ తలకు కిటికీ తగిలి బలమైన గాయం కాగ తైదాలబాపు యువసేన గ్రూప్ లో వచ్చిన మెసేజ్ కి స్పందించి ప్రముఖ సినీ గేయ రచయిత మరియు నిర్మాత తైదల బాపు 15000 (పదిహేను వేల) రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. శనివారం తైదల బాపుయువసేన సభ్యులు చిన్నారి తల్లిదండ్రులకు సహాయాన్ని అందించారు. తైదల బాపుఇదే కాక చాలా రకాలుగా ఆర్థిక సాయం అందిస్తు తన మానవతను చాటుకుంటున్నారు, కరోనా లాక్ డౌన్ సమయంలో మంచిర్యాల జిల్లాలో అభినవ సేవా సంస్థ, తైదల బాపు యువసేన ఆధ్వర్యంలో చాలా గ్రామాలకు నెలసరి సరుకులు అందించడం జరిగింది, అలాగే ఈ మధ్యనే మరణించిన గాయకుడు జై శ్రీనివాస్ కి, కిమ్స్ లో చికిత్స పొందుతున్న రచయిత కందికొండ కు, ఇటీవల గోదావరిఖనికి లోని బ్రెయిన్ టీబీ తో బాధపడుతున్న కుమారి వైష్ణవికి, మంచిర్యాల జిల్లా కు చెందిన శంకర్ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే సకాలంలో స్పందించి ఆర్థిక సహాయం అందించారు. ఇలా ఎవరైనా ఆపదలో ఉన్నారని తనకు తెలిసిన వెంటనే వారికి నేనున్నాను అంటూ సకాలంలో స్పందిస్తూ పలువురికి ఆర్థిక సాయాన్ని అందిస్తూ వారికి ధైర్యం ఇస్తూ తోడుగా నిలుస్తున్నడు తేదల బాపు. తాండూర్ మండలం మాదారం గ్రామానికి చెందిన ఇతను  ఒక సాధారణ సింగరేణి కార్మిక కుటుంబంలో జన్మించి, అనతికాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే జిల్లాలో తనకు ప్రత్యేక అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి, మొదటి నుండి తనకు సేవాగుణం ఉన్న తైదల బాపు మానవసేవే మాధవసేవ అని పలు సేవలు అందిస్తూ స్థానిక ప్రజల మన్ననలు పొందుతున్నారు. మంచిర్యాల జిల్లా సింగరేణి ముద్దుబిడ్డ తైదల బాపు ను సింగరేణి సోనుసూద్ గా పలువురు అభినందిస్తున్నారు.