చీరలను పంపిణీ చేసిన ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు

Published: Saturday October 01, 2022
తల్లాడ, సెప్టెంబర్ 30 (ప్రజాపాలన న్యూస్):
 తల్లాడ మండలం బాలప్పేట గ్రామపంచాయతీలో శుక్రవారం  ఎంపిపి దొడ్డ శ్రీనివాసరావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ కోసూరి వెంకట నరసింహారావు ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపిపి శ్రీనివాసరావు హాజరై చీరలను మహిళలకు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో బాలప్పేట గ్రామ సర్పంచ్ కోసూరు వెంకట నరసింహారావు, ఉప సర్పంచ్ పూర్ణకంటి వెంకటేశ్వర్లు, వార్డు మెంబర్ శ్రీను, నాగేశ్వరరావు, గ్రామస్తులు  పాల్గొన్నారు.