ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

Published: Wednesday August 11, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 63 మంది లబ్ధిదారులకు రూ 18లక్షల 70వేల 500 వందల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు డేగల పాండుయాదవ్ చేతుల మీదుగా ఆయా గ్రామ శాఖల అధ్యక్షులు, సర్పంచ్ లకు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.