తల్లాడ వైద్యులు నవ్యకాంత్ కు ఉత్తమ అవార్డు..

Published: Saturday July 30, 2022
తల్లాడ, జులై 29 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నవ్యకాంత్ కు ఉత్తమ అవార్డు లభించింది. జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రుల కంటే మెరుగైన వైద్యసేవలు అందించినందుకు గాను ఈ అవార్డు దక్కింది. ఈ జులై నెలలో 13 (ప్రసవాలను) కాన్పులను చేసినందుకుగాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, జిల్లా వైద్యాధికారి మాలతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. డాక్టర్ నవ్యకాంత్ సెలవులో ఉండటంతో వైద్యురాలు జ్యోతి అవార్డును అందుకుంది. తల్లాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లతో పాటు సిబ్బంది రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా మండలంలోని అన్ని గ్రామాల్లో హెల్త్ క్యాంపులు పెట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్వైజర్  పెద్ద పుల్లయ్య, సిహెచ్ఓ భాస్కర్, ఏఎన్ఎంలు, ఆసుపత్రి సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించడం వల్లే ఉత్తమ అవార్డు దక్కింది.