పాపన్న గౌడ్ పోస్టల్ కవర్ విడుదల హర్షణీయం*

Published: Friday October 28, 2022

మంచిర్యాల టౌన్, అక్టోబర్ 27, ప్రజాపాలన: పాపన్న గౌడ్ పోస్టల్ కవర్ విడుదల చేయడం హర్షణీయం అని గురువారం రోజు మంచిర్యాల పట్టణంలోని ముఖరం చౌరస్తాలో  బి సి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజన రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోస్టల్ కవర్ విడుదలను బి సి సంఘాల ఐక్యవేదిక  స్వాగతిస్తుదాని అన్నారు. రాష్ట్రంలో పాపన్న గౌడ్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని, ట్యాంక్ బండ్ పై విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బి సి సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గుమ్మల శ్రీనివాస్, కోకన్వీనర్ సంగం లక్ష్మణ్, నాయకులు బేర ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.