రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే అంబేడ్కర్ కు నిజమైన నివాళులు

Published: Tuesday December 07, 2021
కోరుట్ల, డిసెంబరు 06 (ప్రజాపాలన ప్రతినిధి): భారతదేశంలోని ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, మానవత విలువలు నేర్పిన మహానీయుడు బాబా సాహేబ్ బి ఆర్ అంబేద్కర్ గారు అని, అయన రచించిన రాజ్యాంగం ద్వారానే దేశ పరిపాలన సాగుతోందని అలాంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే మనం అంబేద్కర్ కు ఇచ్చే నిజమైన నివాళులు అని ఆర్డీవో పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఆయన 65వ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్డీవో ప్రసంగించారు. ఈ సందర్భంగా పాల్గొన్న తహసీల్దార్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ అయాజ్,ఎస్ ఐ సతీష్, అంబేద్కర్ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్, రాష్ట్ర నాయకులు వుయ్యల నర్సయ్య లు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల కొనసాగింపులో నేటి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల డివిజన్ అధ్యక్షులు వుయ్యల శోభన్, మాదిగ, మాల యువజన సంఘాల అధ్యక్షులు చిట్యాల కర్ణాకర్, సామల్ల వేణు, బిఎస్పీ కార్యదర్శి శనిగారపు ప్రశాంత్, సంఘ నాయకులు పసుల కృష్ణ ప్రసాద్, బెక్కెం అశోక్, పొట్ట సురేందర్, కొంతం రాజం, వుయ్యల శేఖర్, అంతడ్పుల అంజయ్య, సామల్ల దశరథం, పంగ రాజేష్, మగ్గిడి వెంకట్, బలిజ సంతోష్, శివ, గంధం వరుణ్, భూపేల్లి నగేష్, మహారాజ్, రాజగంగారాం తదితరులు పాల్గొన్నారు.