ప్రతామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

Published: Thursday December 09, 2021
మంచిర్యాల బ్యూరో‌, (తాండూర్) డిసెంబర్ 8, ప్రజాపాలన : కేంద్ర ప్రభుత్వం పరిధాన్యం కొనుగోలు చేయనని చెప్పిన సందర్భంలో రైతులు చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు తదితర ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. బుధవారం జిల్లాలోని తాండూర్ మండలం రేచినీలో గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు వరి సాగు కాకుండా వాణిజ్య, కూరగాయలు తదితర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి లాభాలు గడించాలని, వరిసాగు చేయడం వలన భూసారంతో పాటు దిగుబడి తగ్గే అవకాశం ఉందని, పంట మార్పిడి చేస్తూ ఉండాలని తెలిపారు. ఆదాయం లభించే మినుము, పెసర, కంది, మొక్కజొన్న, నువ్వులు, వేరుశెనగ ఇతరత్రా పంటల సాగుపై దృష్టి సారించాలని, ఆయిల్ష్ఫామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని, ఆదాయ వనరులు పెంపొందేలా రైతులు ముందడుగు వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ సురేఖ, ఎంపిడిఓ శశికళ, వ్యవసాయ అధికారి కిరణ్మయి, సర్పంచ్ దుర్గు బాయి, ఎంపిటిసి సభ్యులు శంకర్, ఏ.ఈ.ఓ.లు, ప్రతిభ, సెక్రటరీ వసంత, రైతులు, తదితరులు పాల్గొన్నారు.