బస్సు సర్వీసులు కొనసాగించాలని మధిర ఆర్టిసి డిపోఎదుట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కి వినతి పత్రం

Published: Thursday February 11, 2021
మధిర, ఫిబ్రవరి 10 ప్రజాపాలన; రెండు గ్రామాల కోసం 20 గ్రామాలకు బస్ రాకపోకలు బంద్.. లాక్ డౌన్  ముందు మధిర నుండి కల్లూరు కు ప్రతిరోజు 10 బస్సులు ఈ రూట్ లో తిరిగేవి, అలాగే మధిర టు బోనకల్ :- 02, మధిర టు (ఎర్రుపాలెం రూట్)  విజయవాడ :- 08 ఈ రూట్ లో పెనుగోలను,ఊటుకూరు రెండు గ్రామాలు ఆంధ్రప్రదేశ్ కి చెందినవి.. SFI ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు.. ఈరోజు మధిరలో  ఆర్ టి సి డిపోఎదుట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కి బస్సు సర్వీసులు కొనసాగించాలని  పెద్ద ఎత్తున విద్యార్థులు SFI  ఆధ్వర్యంలో  వినతి పత్రం. అందజేశారు లాక్ డౌన్ తరువాత ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారుల కిలోమీటర్ల ఒప్పందంలో ఈ రెండు గ్రామాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఈ రూట్ లో ఆర్టీసీ బస్ సర్వీస్ లు నిలిచిపోయాయని ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు  వడ్రాణపు మధు తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ :-  ప్రతి నిత్యం కల్లూరు నుండి మధిర, మధిర టు విజయవాడ, మధిర టు గోసవీడు(మీనువోలు) కు వ్యాపార,విద్య, ఇతర అవసరాలు నిమిత్తం వందల సంఖ్యలో ప్రజలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు.. అర్థంతరంగా బస్ సర్వీసులు నిలిపి వేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ఇదే సమయంలో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించక తప్పట్లేదు దింతో ఇదే అదునుగా ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నారు  అని ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించిన  ఇప్పుడు కూడా చాలా బస్సులు తిరగడంలేదని, బోనకల్లు కి :- 1 బస్, కల్లూరికి :- 02 బస్సులు, విజయవాడ ( ఎర్రుపాలెం రూట్ కి) :- 03 కావాల్సి ఉంది.. బస్ సర్వీస్ లు లేకపోతే ఎలా తమ పిల్లలను కాలేజీ లకు పంపాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.. తక్షణమే అధికారులు స్పందించి  ప్రయాణికులు, విద్యార్థుల తగు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు..ఈ కార్యక్రమంలో మధిర ముఖ్య నాయకులు పేరు స్వామి, గణేష్, మురళి, అజయ్, విజయ్, ఆశిస్, భరత్, పార్వతి, లక్ష్మీ, విజయ, దుర్గా, భవానీ, తదితరులు పాల్గొన్నారు...