కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

Published: Friday March 05, 2021

ఎంఆర్పిఎస్ జిల్లా కో ఆర్డినేటర్ పి.ఆనంద్ మాదిగ
వికారాబాద్ జిల్లా మార్చ్ 04 ( ప్రజాపాలన ప్రతినిధి ) : కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ పి ఆనంద్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సీఎం కేసీఆర్ పలు సమావేశాలలో మాట్లాడుతూ మాట్లాడుతూ మనుషులను కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయించుకోవడం ఏమిటని  ప్రశ్నించారని గుర్తు చేశారు. అంగన్వాడీ ఉపాధ్యాయులను, ఆశ వర్కర్లను, ఆయా లను వివిధ శాఖలలో పని చేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సూచించారు. మార్చ్ ఏడవ తేదీన హైదరాబాదులోని నాంపల్లిలోని గార్డెన్ లో జరగబోయే అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఆయాలు పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ ఎఫ్ నాయకులు మల్లికార్జున్ మల్లేష్ రమేష్ వెంకట్ రవి రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.