వైభవముగా అయ్యప్ప స్వామికి ఆరట్టు ఉత్సవం మహా అన్నదానం మధిర డిసెంబరు 7 ప్రజా పాలన ప్రతినిధి ము

Published: Thursday December 08, 2022
స్వామి ఆరట్టు ఉత్సవం మహా అన్నదానం ఘనంగా నిర్వహించారు  అయ్యప్ప స్వామికి వైరా నదిలో నదీ స్నానం  ఆలయ వద్ద భారీ ఎత్తున మహా అన్నదానంఅయ్యప్ప ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు ముగింపు వేడుకల్లో వేలాదిగా హాజరైన భక్తులుస్థానిక లడక బజారులో అయ్యప్ప నగలు వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామికి బుధవారం స్థానిక వైరా నదిలో భక్తుల కోలాహలం మధ్య ఆరట్టు ఉత్సవం (నది స్నానం ) వైభవంగా నిర్వహించారు. గత వారం రోజులుగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు స్వామివారిని
నదీ స్నానంతో ముగిసాయి. వైరా నది వద్ద స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నదీ స్నానమాచరించారు. స్వామివారితో పాటు అయ్యప్ప మాలదారులు భక్తులు కూడా నదిలో పుణ్యస్నాలలో ఆచరించారు మంగళవారం భారీ ఎత్తున జరిగిన పల్లి వేట కార్యక్రమం అనంతరం స్వామి వారిని ఆలయ మంటపంలో ఉంచిన ఉత్సవిగ్రహాన్ని బుధవారం ఉదయం అయ్యప్ప మాలదారులు భక్తులు మహిళలు ప్రత్యేకంగా ఆలంకరించిన పల్లకీలు వైరా నది వద్దకు ఊరేంపుగా తీసుకొని వెళ్లారు నదీ వద్ద స్వామివారికి పసుపు, కుంకుమలతో ప్రత్యేకంగా పూజ నిర్వహించి, మహిళలకు పసుపు,  కుంకుమను అందజేశారు. గత వారం రోజులుగా అయ్యప్ప స్వామి ఆలయంలో చేస్తున్న ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఆరెట్టు ఉత్సవంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని పసుర చైర్మన్ పబ్బతి రవికుమార్ ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ప్రత్యేక పూజలు  ఆలయ వద్ద ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ లింగాల కమల్ రాజు సతీమణి వసంత రాణి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగాల కమలరాజు మాట్లాడుతూ మధిర పట్టణంలోని అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప మాలదారులకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, నడక బజార్ అయ్యప్ప భక్త బృందం, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.