*గుండెపోటుతో అన్నారుగూడెం పూజారి వెంకటేశ్వర్లు మృతి..

Published: Monday February 20, 2023

 

తల్లాడ, ఫిబ్రవరి 18 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ పూజారి అమదీపురపు వెంకటేశ్వర్లు (48) గుండె పోటుతో మృతి చెందారు. మహాశివరాత్రి సందర్భంగా వైరా మండలంలోని స్థానాల లక్ష్మీపురం శివాలయం వద్ద పూజలు చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పక్కనే ఉన్న స్థానికులు చూడగా అప్పటికే మృతిచెందారు. వెంకటేశ్వర్లు అన్నారుగూడెం గ్రామంలో ఇటీవల సంక్రాంతి పర్వదినం సందర్భంగా గ్రామ మొత్తం ద్విచక్ర వాహనంతో హరిదాసు వేషధారణలో పర్యటిస్తూ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. వెంకటేశ్వర్లు తండ్రి పూజారి రంగయ్య ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు. ఆయన అకాల మృతి పట్ల నాయకులు తుమ్మలపల్లి రమేష్ తదితరులు సంతాపం ప్రకటించారు.*తల్లాడ, ఫిబ్రవరి 18 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ పూజారి అమదీపురపు వెంకటేశ్వర్లు (48) గుండె పోటుతో మృతి చెందారు. మహాశివరాత్రి సందర్భంగా వైరా మండలంలోని స్థానాల లక్ష్మీపురం శివాలయం వద్ద పూజలు చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పక్కనే ఉన్న స్థానికులు చూడగా అప్పటికే మృతిచెందారు. వెంకటేశ్వర్లు అన్నారుగూడెం గ్రామంలో ఇటీవల సంక్రాంతి పర్వదినం సందర్భంగా గ్రామ మొత్తం ద్విచక్ర వాహనంతో హరిదాసు వేషధారణలో పర్యటిస్తూ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. వెంకటేశ్వర్లు తండ్రి పూజారి రంగయ్య ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు. ఆయన అకాల మృతి పట్ల నాయకులు తుమ్మలపల్లి రమేష్ తదితరులు సంతాపం ప్రకటించారు.*