పుస్తకావిష్కరణలో అన్నారుగూడెం విద్యార్థుల ప్రతిభ

Published: Monday February 27, 2023
 తల్లాడ, ఫిబ్రవరి 26 (ప్రజాపాలన న్యూస్):
ఖమ్మంలో జరిగిన పుస్తకావిష్కరణ పుస్సకాలలో అన్నారుగూడెం విద్యార్థుల కథ, కవిత ప్రచురితం అయ్యాయని తెలుగు ఉపాధ్యాయురాలు యలగందుల సుచరిత తెలిపారు. 
కార్యక్రమానికి హాజరైన డీఈవో సోమశేఖర శర్మ బాలకవులను ఉపాధ్యాయులను అభినందించారు. అన్నారుగూడెం లో పదవి తరగతి చదువుతున్న  అంజలి రాసిన కామధేనువు కథ ఎంపిక కాబడిన ది.
ఖమ్మం జిల్లా కథలు పల్లకి  సయ్యద్ షఫి సంపాదకత్వంలో వచ్చిన  పుస్తకంలో ప్రచురించబడినది. అలాగే అన్నారుగూడెంలో 9వ తరగతి చదువుతున్న. శృతి 
రాసిన గేయం సుగంధి అనే కవితాసంకలనంలో ప్రచురించబడినది. ఖమ్మం జిల్లాలోని ప్రముఖ కవులు, బాల సాహితీవేత్తలు అందరూ బాల కవులను, ప్రోత్సహంచిన ఉపాధ్యాయురాలు,బాలసాహితీవేత్త, పద్యకవయిత్రి అయిన యలగందుల సుచరితని అభినందించారు.
 అన్నారుగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ గారు మరియు స్టాఫ్ అందరూ శుభాకాంక్షలు తెలిపారు.