విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి

Published: Wednesday December 07, 2022

వేడుకలు మధిర డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని మధిర విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ శ్రీమతి ఎం. అనురాధ  అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. సామాజిక అసమానతలు తొలగించుటకు, అస్పృశ్యత నివారణకు, అట్టడుగు వర్గాల సామాజిక ఉన్నతికి, భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్  సేవలు  అనిర్వచనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  సబ్ డివిజన్ ఇంజనీర్ కెలావణ్య సిహెచ్ శ్రీధర్, విద్యుత్ శాఖ రెవిన్యూ కార్యాలయం జే ఈ ఓ లు వర్మ ,రాజేశ్వరి, సీనియర్ అసిస్టెంట్ రమేష్ , బేగం  లక్ష్మి, పి. రామకృష్ణ, రోజామణి తదితరులు పాల్గొని అంబేద్కర్  ఘనమైన నివాళులర్పించారు.