జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన టీడబ్య్

Published: Thursday February 23, 2023
అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు , ఇళ్ల స్థలాలను  కేటాయించాలని కోరుతూ 
 తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్య్లూజెఎఫ్) మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో  బుధవారం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆసంఘం  జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు తొట్ల మల్లేష్, గోపతి సత్తయ్య లు మాట్లాడుతూ జిల్లాలో చాలామంది జర్నలిస్టులు పేదరికంలో సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లల్లో ఉంటూ.. ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లలో గత 15 సంవత్సరాలుగా ఇళ్ళ స్థలాలు మంజూరు చేయలేదని , సుప్రీంకోర్టు తీర్పు మేరకు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లు , ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు.
జిల్లా వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం నుండి ఇల్లు , ఇళ్ళ స్థలాలు పొందేందుకు ఎదురు చూస్తున్నారు.
చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ కార్డులు, అడ్వర్టైజ్ మెంట్స్ పెంచాలన్నారు. జర్నలిస్టులకు రైల్వే రాయితీ పాస్ లు పునరుద్ధరించాలని కోరారు. బస్ పాస్, రైల్వే పాస్‌లపై వంద శాతం రాయితీ కల్పించాలన్నారు. జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు సైతం ఆర్టీసీ బస్ రాయితీ వర్తింపజేయాలని ,అదే విధంగా జర్నలిస్టులకు టోల్ గేట్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. జర్నలిస్టులందరికి "జర్నలిస్టుబంధు" పథకం ప్రవేశ పెట్టి ఆదుకోవాలని కోరారు. అదే విధంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కౌన్సిల్ సభ్యుడు కామెర వెంకటస్వామి, సభ్యులు సంతోష్, రాజబాబు, గొర్రె లక్ష్మణ్ స్టనిక పాత్రికేయులు పాల్గొన్నారు.