ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 2ప్రజాపాలన ప్రతినిధి *గురునానక్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యతో ఆ

Published: Thursday November 03, 2022
రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం మున్సిాలిటీ పరిధిలో
గురునానక్ విద్యాసంస్థల్లో చదువు తున్న వంశీ పటేల్ (24) తండ్రి శ్రీనివాస్ కరీంనగర్ విద్యార్థి పెట్రోల్ పోసుకొని నిప్పటించుకొని తీవ్ర గాయాలు పాలయ్యాడు. అతనిని ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ హాస్పటల్ కు తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్సను అందించి హైదరాబాదులోని హోమిని హాస్పిటల్ కి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. స్థానిక పోలీసులు అందించిన వివరాల ప్రకారం విద్యార్థి గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు ప్రేమలో విఫలం కావడం వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేశాడని 75 శాతానికి పైగా గాయాలయ్యాయని పరిస్థితి విషమంగా ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి వివరాలు తెలియ వల్సి ఉంది అని తెలిపారు ఈ విషయంపై ఎస్ఎఫ్ఐ,ఏబీవీపీ, స్పేరో, ఎన్ ఎస్ యు ఐ మొదలైన విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల యజమాన్యం అధిక ఫీజులతో ఇబ్బంది పెట్టడం వల్లే ఆత్మహత్య ప్రయత్నం చేశాడని ధర్నా చేస్తుండగా కళాశాల యజమాన్యం విద్యార్థి సంఘాల నాయకులపై సెక్యూరిటీ సిబ్బందితోపాటు కళాశాల బౌన్సర్లు తో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో విద్యార్థి నాయకులు గాయాల పాలయ్యారు. సంఘటన సమయంలో వీడియోలు తీస్తున్న కొంతమంది విలేకరుల ఫోన్లను కూడా లాక్కొని బెదిరింపులకు పాల్పడ్డ కళాశాల బౌసర్లు మీడియా ఫోన్లు ఎలా లాక్కుంటారు అని విలేకరులు ప్రశ్నించగా రూమ్ లోకి తీసుకెళ్లి కొడతామని బెదిరించిన బహుసర్లు. ఆత్మహత్యయత్నం చేసుకున్న విద్యార్థినికి న్యాయం చేయాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థి నాయకులను అధికార మదంతో అరెస్టు చేయించిన గురునానక్ - అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను వెంటనే విడుదల చేయాలి గురునానక్ విద్యాసంస్థలంటే అత్యుత్తమ బోధన,క్యాంపస్ ప్లేస్మెంట్ లు ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ లకే పరిమితం.కానీ ఒక్కసారి మీరు ఆ విద్యా సంస్థల గురించి తెలుసుకుంటే అసలైన చీకటి కోణాలు అర్థమవుతాయి.గురునానక్ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న అనేకమంది అమ్మాయిలపై స్వయానా అధ్యాపకులే లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటనలు ఎన్నో.వాటిని తట్టుకోలేక విద్యార్థులు ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు,విద్యార్థులు ఎంతో మంది తమ పిల్లలకు  మంచి చదువులు అందించాలని ఆరుగాలం శ్రమించే తల్లిదండ్రుల ఆశలను ఆవిరి చేస్తూ విద్యార్థులను నిత్యం ఒత్తిడిలకు గురిచేస్తూ వారిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నది ఈ యజమాన్యం.యజమాన్యం పీజులకోసం పెట్టే ఒత్తిడి తట్టుకోలేక అనేకమంది విద్యార్థులు తమ ప్రాణాలను వదులుకుంటున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.