భారతదేశ రక్షణ దళాల అధిపతి బిపిన్ రావత్ కి ఘన నివాళులు

Published: Friday December 10, 2021

కోరుట్ల, డిసెంబరు 09 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బిపిన్ రావత్ గారికి ఘన నివాళులు అర్పించారు భారత దేశానికి రక్షణగా నిలిచిన దేశ రక్షణ దళాల అధిపతి బిపిన్ రావత్ గారి మృతి దేశానికి తీరని లోటు అని జువ్వాడి నర్సింగ్ రావు అన్నారు. దేశాన్ని సైనికపరంగా రావత్ తీసుకున్న చర్యలు అమోఘం అని అన్నారు. రక్షణశాఖలో బిపిన్  రావత్ గారు విశిష్ట సేవలందించారు వారు విధ్యనభ్యశించిన కళాశాలలో ప్రసంగించడానికి వెళ్లి హెలిక్యాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం భాదాకరం అని బిపిన్ రావత్ తో పాటు 13 మందీ మృతికి మరియు తెలుగు బిడ్డ సాయి తేజ మృతికి సంతాపం, వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు