బంగారు తెలంగాణ కాదు భ్రమల తెలంగాణగా మార్చిన కెసిఆర్ : టౌన్ కార్యదర్శిగా శీలం నర్సింహారావు.

Published: Monday July 19, 2021
మధిర ప్రజా పాలన తేదీ 18 వ తేదీతెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ప్రజాసంక్షేమం కోసం వినియోగించాలే తప్ప అమ్మవద్దని సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శి శీలం నర్సింహారావు డిమాండ్ చేశారు.. జిలుగుమాడు శాఖ మహసభలో మాట్లాడుతూ :- తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపిన కెచంద్రశేఖర్ రావు రాష్ర్టాని అభివృద్ధి చేసింది.. ఏమీ లేకపోగా కొన్ని వేల కోట్లు అప్పు చేసి ప్రజలపై భారాలు మోపారు.. ఇప్పుడు ఆ అప్పులు చాలక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములను అమ్మజూపే ప్రయత్నం చేస్తున్నారని దానిని వెంటనే విరమించుకుని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి ఇవ్వాలని తెలిపారు.. ఎన్నికల్లో దళితులకు మూడెకరాల భూమి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపిన ఆమెని వెంటనే అమలు పరిచే, పెరుగుతున్న నిత్యావసర ధరలను అదుపు చేయాలని పేర్కొన్నారు.. ఈ శాఖ మహాసభకు సిపిఎం పార్టీ టౌన్ కమిటీ సభ్యులు తేలప్రోలు రాధాకృష్ణ, మండవ కృష్ణారావు, పడకంటి మురళి, వడ్రాణపు మధు, జిలుగుమాడు శాఖ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.. జిలుగుమాడు శాఖ కార్యదర్శిగా దోర్నాల విజయ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.. జిలుగుమాడు శాఖ కార్యదర్శికి & ఎన్నికైన సభ్యులుకు మధిర టౌన్ కమిటీ అభినందనలు తెలిపారు నూతన జిలుగుమాడు కార్యదర్శి విజయ్ మాట్లాడుతూ వంద రోజులు ఉపాధి హామీ పనిని జిలుగుమాడులో అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు..