గల్ఫ్ కార్మిక అసోసియేషన్ ఆధ్వర్యంలో విరాళం అందజేత

Published: Wednesday February 22, 2023
జన్నారం, ఫిబ్రవరి 21, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టపూర్ గ్రామానికి చెందిన ఎల్కపెళ్ళి సాయిలు గత నెల రోజుల క్రితం ఇరాక్ లో మరణించగా కిష్టాపూర్ గల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి విరాళం అందజేశారు. మంగళవారం వారి కుటుంబానికి ఆర్థిక సహాయం గా 16, 500 రూపాయలు  తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ కిష్ఠపుర్ గ్రామ కమిటీ తరుపున ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ గల్ఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు కల్లేడ భూమయ్య చర్యవాణి ద్వారా మాట్లాడుతూ దాతలు ఎవరైనా ఉంటే హ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయవలసినదిగా ఆయన కోరారు. గతంలో తెలంగాణ వస్తే విదేశాలలో కార్మికులను వెనక్కి తెచ్చి వారికి ఉపాధి హామీ చూపిస్తూ వారి సంక్షేమానికి ప్రత్యేక చట్టం ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఎలక్షన్ మినీ పోస్ట్ తో కూడా 2014 సంవత్సరంలో చెప్పిన మాటలు మాటల్లాగే మిగిలిపోయినరు. తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు నడుస్తున్న గల్ఫ్ కార్మికుల జీవితంలో మార్పు రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే వలసలు ఆగుతాయి అనుకుంటే అలసలు రెండింతలు కావడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రాజకీయాలకు హత్యగా గల్ఫ్ కార్మికులందరూ పాల్గొని ఉద్యమాన్ని ప్రదేశంలో విదేశాలలో ఉంటూ కూడా బలోపేతం చేసామన్నారు. తెలంగాణ రాష్ట్ర అధికారంలోకి రాగానే గల్ఫ్ కన్నుల కోసం కేరళ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కల్పనాల కోసం ప్రత్యేక నిధి 500 కోట్గా కేటాయిస్తామని చెప్పారు, అదేవిధంగా  బడ్జెట్ సవరణ బిల్లులో 500 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న మన్నారు. ఈ కార్యక్రమంలో కిష్టాపూర్ గల్ఫ్ అసోసియేషన్ సభ్యులు, బాధితులు ఇతరులు పాల్గొన్నారు.