బాలల రక్షణకు 1098కు కాల్ చేయాలి

Published: Tuesday November 16, 2021
వికారాబాద్ బ్యూరో 15 నవంబర్ ప్రజాపాలన : ఈనెల 14 నుండి 20 వరకు బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా, ఆపదలో ఉన్న బాలల రక్షణ కొసం 1098 కు కాల్ చేస్తానని, బాలలకు ఎవరైనా కీడు తలపెట్టిన, వారి హక్కులను భంగం కల్గించిన లేదా వ్యవహరించిన బాలల పక్షాన ఉండి వారికి సహాయ పడతాననే ఉద్యేశ్యంతో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గోడ పత్రికపై సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ నిఖిల సందేశంతో పాటు మొదటి సంతకం చేశారు. జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య వివిధ శాఖల అధికారులు ఈ పోస్టరుపై సంతకాలు చేశారు.అనంతరం దోమ మండలం, పాలేపల్లి గ్రామానికి చెందిన కటిక ఖాజా పాషా అనే శారీరక దివ్యాంగునికి తన అభ్యర్తన మేరకు వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా మంజూరైన ట్రై సైకిల్ ను అందించడం జరిగినది.