అంగరంగ వైభవంగా వరుణార్చన, అభిషేక మహా హోమం

Published: Friday December 03, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 1ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు ఒడ్డున బుధవారం నాడు వరుణఅర్చన, అభిషేక హోమం వేదమంత్రాల సాక్షిగా అంగరంగ వైభవంగా స్థానిక శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి దంపతులు, జరిపించారు. అభిషేక హోమానికి కి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గా సబితమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రజల కోసం పాటుపడే మహోన్నతమైన వ్యక్తిని, గతంలో పది సంవత్సరాల క్రితం ఆయన ఎమ్మెల్యేగా ఉండి కూడా పాదయాత్ర చేసి, చెరువులో వరుణయాగం చేయడం జరిగిందని, దాని ఫలితంగా ఇన్ని సంవత్సరాలకు చెరువు నిండడం తో పాటు, చుట్టుపక్కల గ్రామాలల్లో మరియు మన జిల్లా, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురీసాయాని, దీంతో ప్రజలు సుభిక్షంగా జీవిస్తున్నారని అన్నారు. ఆ వరుణదేవుడు కరుణించి, మన ఎమ్మెల్యే కోరిక తీరడంతో తిరిగి వరుణార్చన, అభిషేక హోమం తలపెట్టడం చాలా పుణ్యకార్యమని, దీనివల్ల మన ప్రాంతాల్లోని ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో వరుణ యాగం చేయడం వల్ల వర్షాలు రావడంతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండడం వల్ల తనకెంతో ఆనందాన్నిచ్చిందని అందుకే తిరిగి ఇప్పుడు  ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. అర్చన అభిషేక హోమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, తెరాస రాష్ట్ర నాయకులు మంచి రెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి దంపతులు, ఆర్డీవో వెంకటాచారి, ఏసీబీ బాలకృష్ణారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, నియోజకవర్గంలోని మున్సిపల్ పాలకవర్గం, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, తెరాస యువజన్, విద్యార్థి  విభాగం, నాయకులు అధ్యక్ష కార్యదర్శులు, జెర్కొని రాజు, టిఆర్ఎస్వి అధ్యక్షులు నిట్టు జగదీష్, తెరాస పార్టీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, తెరాస మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.