సింగరేణి బొగ్గు గనులలో విస్తృతంగా పర్యటించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంత

Published: Tuesday January 03, 2023
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఓసి2, కేసిహెచ్పి, ఏజెంట్ ఆఫీస్, ఏరియా వర్క్ షాప్ సింగరేణి ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు  విస్తృతంగా పర్యటించడం  జరిగింది., ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం సింగరేణి ఉద్యోగస్తులందరికీ మంచి జరగాలని , సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో లక్ష్యాలను సాధించాలని కోరుతున్నాను అన్నారు. ఉద్యోగస్తులు కార్మికులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు, సమిష్టి కృషితో ఆరోగ్యకరమైన రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించి సింగరేణి సంస్థను ప్రగతి బాటలో నిలుపుదామన్నారు. బొగ్గు ఉత్పత్తిలో కార్మికులు రక్షణ పాటించాలని ఆయన కోరారు., సీఎం కేసీఆర్  నేతృత్వంలో సింగరేణి అద్భుతమైన దేశంలోని ఇతర సంస్థల కంటే గొప్పగా లాభాలు సాధిస్తుందని అన్నారు, సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్  అనేకసార్లు విజ్ఞప్తి చేసిన కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని  ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు, తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.