బహుమతులు పంపిణీ చేసిన సర్పంచ్ శ్రీనివాసరావు

Published: Friday January 27, 2023
తల్లాడ, జనవరి 26 (ప్రజాపాలన న్యూస్): 
 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తల్లాడ మండలంలోని నూతనకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెలుపొందిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు గురువారం బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించటం అభినందనీయమన్నారు. తొలుత ఆయన గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. స్కూల్లో హెచ్ఎం వెంకటేశ్వరరావు జెండాను ఎగరవేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోహన్, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.