చిన్న బీరవల్లి రైతు వేదిక నందు రైతులకు శిక్షణా కార్యక్రమం ముఖ్య అతిథిగా విత్తన అభివృద్ధి సం

Published: Wednesday October 06, 2021

బోనకల్, అక్టోబర్ 04, ప్రజాపాలన ప్రతినిధి : మండలంలో చిన్న బీరవెల్లి క్లస్టర్ పరిధిలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సూచనలు సలహాలు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఇవ్వడం జరిగింది. ఈ మేరకు యాసంగి లో వరి కి బదులుగా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా చిన్న బీరవల్లి రైతు వేదిక నందు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాధారణంగా నవంబర్ నెలలో వరి కోతలు మొదలై డిసెంబర్లో పూర్తవుతాయి కనుక రైతు సోదరులు అందరూ ప్రత్యామ్నాయ పంట రబీ మరియు యాసంగి ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి చెరువులు కాలువల కింద మీరు ఎప్పటికీ నిల్వ ఉండే భూములలో పంట మార్పిడి అవకాశం లేనట్లయితే తప్పనిసరిగా స్వల్పకాలిక మరియు మధ్యకాలిక వరి పంట సాగు చేసుకోగలరు. తెలంగాణ సోనా, వరంగల్ సాంబ, మరియు  సన్నాలు, జగిత్యాల సన్నాలు వరి కోత అనంతరం ఇసుక, చలక నీటి సౌకర్యం ఉండి ఆరు నుంచి ఎనిమిది తడులు ఇవ్వగలిగిన రైతులు వేరుశనగ పంట వైపు మొగ్గు చూపాలి. మూడు నుంచి నాలుగు తడులు ఇవ్వగలిగిన రైతులు నువ్వులు, ఆవాలు, మినుము, బొబ్బర్లు, జొన్నలు వేసుకో గలరు. నల్లరేగడి నేలల్లో కుసుమలు, శెనగ వంటి పంటలు నీటి తడి అవసరం లేకుండా వేసుకోవచ్చు. నీటి సౌకర్యం ఉన్న రైతులు పొద్దుతిరుగుడు, నువ్వులు  పండించుకోవచ్చునని, బావి లేదా బోరు ఉన్నచోట వరి పంట సాగు చేయు రైతులు వరికి బదులు నేల రకాన్ని బట్టి ఆరుతడి పంటలను వేసుకోవాలి. ఉద్యానవన పంటల లో పామాయిల్ పంటకు ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు కొంగర వెంకటేశ్వరరావు, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు మందడపు తిరుమల రావు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు వేమూరి ప్రసాద్, గ్రామ సర్పంచులు  శాంతయ్య, రవీంద్ర బాబు, సాధినేని చంద్రకళ, ఎంపీటీసీ సండ్రా శ్రీలక్ష్మి, ఉప సర్పంచులు, గ్రామ రైతు బంధు  సమితి అధ్యక్షులు, మండల వ్యవసాయ అధికారి శరత్ బాబు, మండల రైతు బంధు సమితి సభ్యులు, గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు, వ్యవసాయ విస్తరణ అధికారి గోపి, తేజ, నాగ సాయి, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.