*రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగిస్తున్న కేసీఆర్*కెసిఆర్ కి కోర్టులపై గౌరవం లేదా?*

Published: Tuesday December 13, 2022
*షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలి*
వైయస్సార్ టిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మద్దెల*
మధిర డిసెంబర్ 12 (ప్రజా పాలన ప్రతి నిధి) తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించే గొంతుకులను అణచివేస్తూ దుర్మార్గమైన పాలన చేస్తున్నారని వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మధిర నియోజకవర్గం కోఆర్డినేటర్ రిటైర్డ్ సిఐ డాక్టర్ మద్దెల ప్రసాద రావు విమర్శించారు. ప్రజల సమస్యలపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవటానికి నిరసనగా సోమవారం మధిర లోని అంబేద్కర్ విగ్రహానికి వారు వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మద్దెల ప్రసాదరావు మాట్లాడుతూ షర్మిల పాదయాత్రకు కోర్టు అనుమతి ఇచ్చిందన్నారు. షర్మిల పాదయాత్రకు లభిస్తున్న ఆదరణ చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల ద్వారా షర్మిలమ్మ పాదయాత్రకు అనుమతి నిరాకరించటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్ షర్మిలమ్మ తెలంగాణ రాష్ట్రంలో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడం జరిగిందన్నారు. షర్మిల పాదయాత్ర వల్ల ఎక్కడ కూడా ఎటువంటి ఘర్షణలు జరగలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను షర్మిల పాదయాత్ర ద్వారా నిలదీయడంతో టిఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకున్నదన్నారు. కెసిఆర్ కుటుంబం కాలేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతికి పాల్పడిందని మద్యం పాలసీలో ముఖ్యమంత్రి కుమార్తె కవిత అవినీతికి పాల్పడినట్లు కథనాలు వస్తున్నాయన్నారు. టిఆర్ఎస్ అవినీతి పాలనను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజల పక్షాన ప్రశ్నించడంతో పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే ఓర్వలేక షర్మిలను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. అరెస్టులకు కేసులకు రాజన్న బిడ్డ భయపడధని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి వర్రే మరియదాసు మండల అధ్యక్షులు వాకా వీరారెడ్డి, సామినేని రవి, మౌలానా ఐలూరి ఉమామహేశ్వర రెడ్డి, వేమిరెడ్డి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు