లయన్స్ క్లబ్ ఆఫ్ మధిర గోల్డ్ ఆధ్వర్యంలో వీధి వ్యాపారస్తులకు తోపుడు బండ్లు అందజేత మధిర రూరల్

Published: Wednesday February 22, 2023
శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణమండపం ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ మధిర గోల్డ్ వారి ఆధ్వర్యంలో పబ్బతి  రవికుమార్ జన్మదినం సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో మున్సిపాలిటీలో
వీధి వ్యాపారస్తులకు తోపుడు బండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు చారుగుండ్ల వెంకట లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి హృదయంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పబ్బతి రవి కుమార్ కి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు కలగజేయాలని ఆకాంక్షిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటారని ఆశిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ చారుగుండ్ల వెంకట లక్ష్మీ నరసింహారావు, కార్యదర్శి లయన్ కుంచం కృష్ణారావు, ఉపాధ్యక్షులు లయన్ వనమా కిరణ్ కుమార్, లయన్ వంగవీటి రాజశేఖర్, ముఖ్య అతిథులుగా ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వనమా వేణుగోపాలరావు, మాజీ అధ్యక్షులు ఇరుకుళ్ళ లక్ష్మీ నరసింహారావు, కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవ్యాలయం అధ్యక్షులు కపిలవాయి జగన్మోహన్రావు కాజా చక్రధర్ రావు, వేములపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.