పౌష్టికాహారంతో మెరుగైన ఆరోగ్యం

Published: Thursday September 09, 2021
మూలమాడ గ్రామ అంగన్వాడీ టీచర్ బి.సుమిత్ర
వికారాబాద్ బ్యూరో 8 సెప్టెంబర్ ప్రజా పాలన: పాలిచ్చే తల్లులు వరి గోధుమ రాగులు జొన్నలు సజ్జలు బంగాళదుంపలు బీట్రూట్ ల తో తయారైన ఆహారాన్ని తీసుకోవాలని మూలమాడ గ్రామ అంగన్వాడి టీచర్ అన్నారు. బుధవారం నవాబ్ పేట్ మండల పరిధిలోని మూలమాడ గ్రామంలో పౌష్టికాహారం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెరుగుదలకు ఉపయోగపడే వేరుశెనగ కందిపప్పు పెసరపప్పు మినపప్పు బాదంపప్పు వంటివి తీసుకోవాలని సూచించారు మాంసకృత్తులను ఇచ్చే చేపలు గుడ్లు మాంసం పాలు మొదలగునవి తీసుకోవాలని పేర్కొన్నారు ఆరోగ్య రక్షణకు విటమిన్లు ఖనిజలవణాలు ఆకుకూరలు మెంతికూర తోటకూర గోంగూర బచ్చలి కూర ఆహారం తీసుకోవాలని వివరించారు వీటితో పాటు వంకాయ బెండకాయ సొరకాయ బీరకాయ మునక్కాయ టమాటా క్యాబేజి క్యారెట్ బీన్స్ మొదలగునవి తీసుకోవాలని వివరించారు మామిడి పనస నారింజ బొప్పాయి అరటి ఆపిల్ సీతాఫలం జామ నిమ్మ దానిమ్మ పండు కూడా తీసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో పిల్లల తల్లులు గర్భిణీలు బాలింతలు పిల్లల బొమ్మలు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్యామల వివో బి స్వప్న పాల్గొన్నారు.