*ప్రభుత్వ రంగ సంస్థల్లో ధోభీ కాంట్రాక్టు రజకులకె కేటాయించాలి* రాష్ట్ర అధ్యక్షులు గోపి డిమాం

Published: Tuesday February 14, 2023

మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 13, ప్రజాపాలన: ప్రభుత్వ రంగ సంస్థల్లో ధోభీ కాంట్రాక్టు రజకులకె కేటాయించాలని రజక రాష్ట్ర అధ్యక్షులు గోపి అన్నారు. సోమవారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు సంగెం లక్ష్మణ్, జిల్లా ఉద్యోగ విభాగం అధ్యక్షులు దొడ్డిపట్ల శంకర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ బట్టలు ఉతికే కాంట్రాక్టు కార్పోరేట్ సంస్థలకు ఇవ్వడంవల్ల రజకులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కావున తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వివిధ ప్రభుత్వ సంస్థల్లో బట్టలు ఉతికే కాంట్రాక్టు రజక కులస్తులకు కేటాయించే విధంగా ఒక జి ఓ ను తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.  మహాత్మా జ్యోతిరావు పూలే జాతీయ అవార్డు గ్రహీత ముక్కెర రాజేశంను శాలువాతో సన్మానించారు. అనంతరం నూతన జిల్లా కమిటీ నియమించారు. ఈ కార్యక్రమంలో కోలిపాక రమేష్, తంగళ్ళపల్లి తిరుపతి, కుదురుపాక పోశం, రాసమల్ల కుమార్,   కటుకూరి రాజేంద్రప్రసాద్,   చంద్రగిరి చంద్రమౌళి, తాడూరి శంకర్, అరటి పండ్ల శంకర్,పారిపల్లి మల్లయ్య, అన్నారం సత్యనారాయణ ,కటుకూరి ముత్తయ్య, గుండ శంకర్, గుండ తిరుపతి, గుండ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.