ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టడానికే చెక్ డ్యాముల నిర్మాణం

Published: Monday July 19, 2021
జగిత్యాల, జులై 18 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల రూరల్ మండల్ గుల్లపెట్ లో 170 లక్షలతో నిర్మాణ చివరి దశలో ఉన్న చెక్ డ్యాములను ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతనే వ్యవసాయానికి రైతుల శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నదని అన్నారు. మిషన్ కాకతీయ చెక్ డ్యామ్ల నిర్మాణం ఎస్సారెస్పీ కెనాల్ తూముల ఏర్పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం 24 గంటల కరెంట్ నకిలీ విత్తనాలు అమ్మే వారిపై ఉక్కుపాదం రైతు భీమా రైతు బంధు కొత్త పాస్ బుక్ పంపిణీ ధరణి పోర్టల్ ఏర్పాటు రైతు వేదికల నిర్మాణం ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారి నియామకం ఇలా రైతుల సంక్షేమానికి అభివృద్ధికి కృషిచేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు. ఈనాడు గుల్లపేటలో చెక్ డ్యామ్ నిర్మాణం వల్ల ఎక్కడికక్కడ నీటి జలాలు ఒడిసిపట్టడం వల్ల ఆ ప్రాంతాలో భూగర్భజలాలు పెరుగుతాయని బావుల్లో నీరు పుష్కలంగా ఉంటుందని బోర్లు వేసే పరిస్థితి తప్పుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్ ఏఎంసి చైర్మన్ దామోదర్ రావు బాల ముకుందాం సర్పంచ్ తిరుపతి రాజిరెడ్డి ఏఎంసి డైరెక్టర్ నరేష్ నాయకులు శ్రీపాల్ శ్రీనివాస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.