వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయండి

Published: Saturday September 24, 2022
బోనకల్, సెప్టెంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి: డిసెంబర్ 5 ,6,7తారీకులలో ఖమ్మంలో జరుగు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మూడో మహాసభలను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరై విజయన్ హాజరు కానున్నారు. ఈ మహాసభలలో దున్నేవానికే భూమి, వెట్టి చాకిరీ రద్దు, ప్రజాస్వామిక వ్యవస్థ కోసం సాగిన వీర తెలంగాణ సాయుధ పోరాటాల గురించి చర్చించనున్నారు. ప్రభుత్వం విద్య వైద్య రంగాలను అందరికీ ఉచితంగా అందాలని, పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని , నిత్యవసర వస్తువులు పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు తగ్గించాలని, పెట్టుబడిదారులకు రాయితీలు, పేద మధ్యతరగతి ప్రజలపై బారాలు మోపే మోడీ సర్కారుపై పోరాటం రూపొందించే లక్ష్యంతో జరుగుతున్న ఈ మహా సభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పట్టణ సిపిఎం నాయకులు అంబరపుడి సుధాకర్, ఖమ్మం పట్టణ వన్ టౌన్ ఐద్వా కార్యదర్శి భాగం అజిత, అద్దంకి విప్లవ కుమార్, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సిపిఎం మండల కమిటీ సభ్యులు తుళ్లూరు రమేష్, సిపిఎం నాయకులు మందడపు శ్రీనివాసరావు, బంధం శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, గుగులోతు నరేష్ తదితరులు పాల్గొన్నారు.