పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలి

Published: Friday May 27, 2022
ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ
 
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి శనిగరపు రజనీకాంత్ మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మొటిక్ ఛార్జీలు పెంచాలి అని  డిమాండ్ చేయడం జరిగింది,  నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకి ఆకాశాన్నంటుతున్న కానీ సంక్షేమ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు మెస్ బిల్లులు మాత్రం పెంచక పోవడం చాలా దుర్మార్గమని ఇది సరైంది కాదన్నారు.
 
గురువారం నాడు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక మంకమ్మ తోటలోని జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
సంక్షేమ హాస్టల్లో  చదువుతున్న విద్యార్థులు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే వారికి ప్రతి నెల 15 వందలు మాత్రమే ఇవ్వడం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు.
నిత్యవసర సరుకుల ధరలు అధికంగా పెరగడం వలన కాంట్రాక్టర్లు నాణ్యతలేని కూరగాయలు వేస్తున్నారు, మార్కెట్లు ఏ కూరగాయలకు అయితే తక్కువ అ ధరలు ఉంటాయో వాటిని హాస్టళ్లకు వేయడం జరుగుతుందని, దానివలన విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందక అనారోగ్యం పాలయ్యే పరిస్థితి కనబడుతోంది. కరోనా తర్వాత విద్యార్థులకు దాదాపు సగం మెను తగ్గించడం జరిగింది. కాబట్టి వీటిపైన జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్సీ , బీసీ, డిడి లు పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని హాస్టల్స్ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు సంక్షేమ మంత్రులు ఉన్నా కానీ ఏ ఒక్క రోజు కూడా సంక్షేమ హాస్టల్లో సమస్యల పైన మాట్లాడిన పరిస్థితి కనపడటం లేదు, కాబట్టి ఇప్పటికైనా మంత్రులు స్పందించి విద్యార్థులకు నూతన భవనాలు ఎర్పాటు చేసి, మెస్ కాస్మొటిక్ ఛార్జీలు 2500 పెంచి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. లేనియెడ  మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
 ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గజ్జల శ్రీకాంత్, నగర అధ్యక్ష కార్యదర్శి తిప్పారపు రోహిత్, కంపెల్లి అరవింద్, నాయకులు తిరుపతి, శ్రవణ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.