కరుణా నివాస్ ఓల్డ్ ఏజ్ హోమ్ ను సందర్శించిన జడ్జి శ్రీకాంత్

Published: Friday August 06, 2021
ఎర్రుపాలెం, ఆగస్టు 05, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం రాష్ట్ర హైకోర్ట్  ఆదేశాల అనుసారం ఎర్రుపాలెం మండల కేంద్రంలో ఉన్న కరుణా నివాస్ ఓల్డ్ ఏజ్ హోమ్ ను బుధవారం మధిర లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ మరియు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్న వృద్ధుల ను ఉద్దేశించి మాట్లాడుతూతమ కుమారులు లేదా కుటుంబం సభ్యులు ఎవరైనా ఎటువంటి ఇబ్బందులకు గురిచేస్తే లీగల్ గా తమ దృష్టికి సమస్యలు తీసుకొని వచ్చినట్లయితే వారి వద్ద నుండి తమ పోషణకు అవసరమైన బృతి ఇప్పిస్తామని కుటుంబం నుండి  ఎటువంటి ఒత్తిడులు వచ్చినా తమకు సమాచారం అందించాలని ఆయన అన్నారు. అనంతరం ఆయన వృద్ధులకు పండ్లు, శానిటైజర్,బ్రెడ్, మాస్కులు పంపిణీ చేశారు. తదనంతరం ఆయన వృద్ధులతో మాట్లాడుతూ ఓల్డ్ ఏజ్ హోం లో అందుతున్న సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న సమస్యలను సైతం తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎరుపాలెం ఎస్ హెచ్ ఓ గా పనిచేస్తున్న ఎస్ఐ కే  వెంకటేష్, మధిర  బార్ అసోసియేషన్ అధ్యక్షులు భైరవభట్ల శ్రీనివాసరావు, అడ్వకేట్లు గంధం శ్రీనివాస్ రావు, సతీష్, సిస్టర్స్ పుష్ప, ఎలిసా, అనీసా, సుమ, దీప్తి, పోలీస్ కానిస్టేబుల్ ప్రకాష్, వెంకట్,వాసు తదితరులు పాల్గొన్నారు.