ఆదిత్య ఉన్నత పాఠశాలలో రంగవల్లుల పోటీలు .

Published: Friday January 13, 2023
మంచిర్యాల బ్యూరో,  ,జనవరి12,ప్రజాపాలన:
 
సంక్రాంతి పండుగ వేడుకలు పాఠశాల లో సందడి చేస్తున్నాయి. గురువారం సి,సి నస్పూర్ లోని ఆదిత్య ఉన్నత పాఠశాలలో మకర సంక్రాంతిని పురస్కరించుకొని విద్యార్థులకు ఏర్పాటు చేసిన రంగవల్లుల పోటీలు ఎంతో వైభవోపేతంగా, నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో పాఠశాల మాతా పోషకులు ,విద్యార్థిని విద్యార్థులు , ఉపాధ్యాయురాళ్ళు, రాంనగర్ లోని యువతులు పాల్గొని పాఠశాల పరిసరాలను రంగవల్లులతో ముస్తాబు చేశారు. ఒకరికంటే మరొకరు తమ నైపుణ్యాలను ప్రదర్శించి పోటీపడి ముగ్గులు వేశారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలను పోషకుల నుండి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉపాధ్యాయినిల నుండి ప్రథమ ,ద్వితీయ ,తృతీయ బహుమతులు ,అదేవిధంగా విద్యార్థుల నుండి ప్రధమ ,ద్వితీయ తృతీయ బహుమతులను పాఠశాల యాజమాన్యం బహూకరించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గోపతి సత్తయ్య మాట్లాడుతూ సంక్రాంతికి ఉన్న ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. రైతే దేశానికి వెన్నెముక అని ,ఇది రైతుల పండుగని కష్టపడి పండించిన పంట రైతు చేతికి అందే సమయం, వారి కష్టానికి అందిన ప్రతిఫలానికి వారు ఈ పండుగను ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అప్పని తిరుపతి, ఉపాధ్యాయుని ,ఉపాధ్యాయులు, పోషకులు, యువతులు పాల్గొన్నారు.