రాష్ట్రానికి మార్గదర్శిగా నిలవాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇప్పటివరక

Published: Monday April 26, 2021

జిన్నారం, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ప్రజలకు భరోసా కలిగించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్  వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోకపోవడం బాధాకరం మరియు రాష్ట్ర ప్రజలకు టీకా తీసుకోవడం వల్ల అనేక అపోహలు కలుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుంటేనే ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి తీసుకుంటారని జిన్నారం కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు యనగండ్ల నరేందర్ అన్నారు, అయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ రావు గ్రీన్ చాలెంజ్ అని చెట్లు నాటి ఛాలెంజ్ విసిరిన ఎంపీ మరి ఇప్పుడున్న కరోనా మహమ్మారి తరిమేందుకు వ్యాక్సిన్ చాలెంజ్లు ఎందుకు విసరడం లేదని రాష్ట్ర ప్రజల తరుపున ప్రశ్నిస్తునమన్నారు, అలాగే 25 వందల కోట్లతో ఉచితంగా టీకా ఇస్తున్నందుకు సంతోషమే కానీ బాధ్యతగల పదవిలో ఉండి మీరే తీసుకోకపోతే దానిపై అపోహలో ఉన్న యువకులు ఎలా తీసుకుంటారాని. కాబట్టి రాష్ట్రంలోని ముఖ్యమంత్రి నుంచి జిల్లా నాయకుని వరకు వ్యాక్సిన్ అపోహలు లేకుండా ముందుగా వారే తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే  నియోజకవర్గస్థాయిలో మండల స్థాయిలో గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధులు వ్యాక్సిన్ తీసుకొని ప్రజలకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటునమని, ఎందుకంటే గ్రామ స్థాయిలో అనేక అపోహలు తీవ్రంగా వ్యక్తం అవుతున్న సందర్భంలో ప్రజాప్రతినిధులు ముందుగా వ్యాక్సిన్ తీసుకుంటే ప్రజల ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకునే ధైర్యం చేస్తారని గ్రామాలను రాష్ట్రాన్ని దేశాన్ని కరోనా రహితంగా దేశంగా మార్చడానికి మన వంతు కృషి మనం చేయాలని కోరుకుంటున్నాం అన్నారు