దేవిశ్రీ గార్డెన్ లో ఎన్ఎస్వి డిగ్రీ కళాశాల నైపుణ్య శిక్షణ తరగతుల ముగింపు

Published: Wednesday September 22, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ ఎన్ ఎస్ వి డిగ్రీ కళాశాలలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13వ తేదీ నుండి 20వ రోజు వరకు గత వారం రోజులుగా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు వివిధ రకాల నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించి దేవిశ్రీ గార్డెన్ లో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధులుగా కరీంనగర్ డిస్టిక్ రిలేషన్షిప్ మేనేజర్ గంగా ప్రసాద్, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ మ్యాక్స్ మహేష్, కళాశాల డైరెక్టర్ కడారి మోహన్ రెడ్డి ఉన్నారు. గోపు మునిందర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నవీన్ రెడ్డి ఆశయ సాధన కనుగుణంగా నూతన ఆలోచనల వైపు అడుగులు వేస్తూ జిల్లాలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా విద్య తో పాటు అర్థమెటిక్ రీజనింగ్, మహీంద్రా ప్రైడ్ క్లాస్ ప్రోగ్రామ్స్ ని ఫైనలియర్ విద్యార్థులకు ఉద్యోగాలు అందించడమే అందించడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి విద్యార్థి పాఠశాల స్థాయి నుండి కష్టపడి చదివి డిగ్రీ చదువును నామమాత్రంగా చదవకుండా నాణ్యమైన విద్యను అందించే కళాశాలలోనే డిగ్రీ పూర్తిచేసి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, మహీంద్రా ప్రైడ్ క్రాస్ రూమ్ ట్రేడర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.