నేడు నాటిన మొక్కలే భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Monday July 18, 2022
మంచిర్యాల బ్యూరో,  జూలై 17,  ప్రజాపాలన : 
 
నేడు నాటిన మొక్కలతోనే  భవిష్యత్తు తరాలకు  సహజమైన ప్రాణవాయువు అందించగలుగుతామని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజున మందమర్రి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న టోల్ గేట్ వద్ద ఎన్. హెచ్. ఎ.-363 వారి ఆధ్వర్యంలో చేపట్టిన 1 వేయి మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారుల వెంట మూడు వరసలు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు., కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో చేసే విధంగా అధికారులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత జాతీయ రహదారుల సంస్థ అధికారులు, అధాని హెచ్. జి. ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ ప్రతినిధులు  సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.