బీజెపీ ఎస్సీ మోర్చా సంవిధన్ గౌరవ అభియాన్ జిల్లా కో కన్వీనర్ గా దామ రాజేష్

Published: Thursday November 18, 2021

కోరుట్ల, నవంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా సంవిధన్ గౌరవ అభియాన్ జగిత్యాల జిల్లా కో కన్వీనర్ కోరుట్ల పట్టణానికి చెందిన ధామ రాజేష్ ని నియమించారు. ఈ ఎన్నిక పట్ల దామా రాజేష్ మాట్లాడుతూ నా పైన నమ్మకంతో నన్ను నియమించిన రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, జగిత్యాల జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ, జగిత్యాల జిల్లా కన్వీనర్ అలుగుర్తి లక్ష్మీనారాయణ(స్వామి)కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.